ప్రతి నెల ఇంటింటికీ చేరే రేషన్ బియ్యం ఇకపై వస్తాయా అంటే కాదనే వినిపిస్తోంది. జగనన్న అందుబాటులోకి తీసుకొచ్చిన ఇంటింటికీ రేషన్ పంపిణీకి ఇకపై బ్రేకులు పడనున్నాయి అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్…అసలు వివరాల్లోకి వెళితే ప్రతి నెల ఇంటింటికీ రేషన్ వాహనాల భీమా మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం తామే చెల్లిస్తాము అన్న విషయం తెలిసిందే. అయితే బ్యాంకు ఆఫ్ బరోడా మాత్రం వాహన దారులనే బాధ్యులని అంటున్నారు.
అంతేకాదు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నుండి ఏకంగా ఒక్కొక్కరి వద్ద నుండి రూ.18వేల నుంచి రూ.23వేల కట్ చేసేసింది ఇలా అయితే ఇకపై తాము వాహనాలు తిప్పలేమని అంటున్నారు. ఈ విషయం పై వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్య ను పరిష్కరించి ఆదుకోవాలని అంటున్నారు. లేదంటే ఇకపై వారు రేషన్ వాహనాలు నడపలేమని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.