బయట వర్షం పడుతుంటే.. ఇంట్లో బజ్జీలు వేసుకుని తింటే బాగుంటుంది కానీ బాత్ చేస్తే అస్సలు బాగోదు అంటున్నారు నిపుణులు. మీరు విన్నది నిజమే.. వర్షం పడేప్పుడు చెట్లు కింద నుల్చోవడం ఎంత ప్రమాదమో..షవర్ కింద ఉండటం కూడా అంతే ప్రమాదమట. వర్షం సమయంలో ఆకాశంలో మెరుపుల వల్ల మనిషికి ప్రమాదం ఉండే అవకాశం ఉందంటున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో బాత్‌రూమ్‌లో షవర్ కింద స్నానం చేయడం వల్ల ఆకాశంలో మెరుపులు మెరిసి ఆ విద్యుత్ ప్రసరణ భూమికి చేరుకుంటుంది. దీంతో స్నానం చేస్తుండగా, ప్రమాదం సంభవించే అవకాశం ఉందంటున్నారు.
పిడుగులు వచ్చినప్పుడల్లా మెటల్‌తో చేసిన వస్తువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. షవర్ పైపులు సాధారణంగా లోహంతో తయారు చేస్తారు. మెరుపు ఇంటిని తాకినప్పుడు అది భూమికి చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. షవర్ మెటల్ పైపులు ఇందుకు ప్రభావితమవుతాయి. ఈ విధంగా, షవర్ పైపు నుండి విద్యుత్తు, దాని నుండి నీరు బయటకు వచ్చే ప్రక్రియ స్నానం చేస్తున్న వ్యక్తికి ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు అంటున్నారు. వర్షకాలంలో ఉరుములు మెరుపులు వస్తుంటే బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. బాత్‌రూమ్ బయట ఉండకుండా ఇంటిలోపల ఉన్నా ప్రమాదమేనంటున్నారు నిపుణులు.
వర్షం సమయంలో కాంక్రీట్ గోడకు దగ్గరగా నిలబడకండి. ఎందుకంటే వాటిలో ఇనుప కడ్డీలు ఉంటాయి. అలాగే ఇనుప వస్తువులను కడగకూడదు. విద్యుత్తు అంతరాయం సమయంలో నీటికి సంబంధించిన పనులు చేయొద్దని నిపుణులు అంటున్నారు. బయట వర్షం పడుతుంటే.. ఇంట్లో షవర్ బాత్ లాంటివి చేయడం మంచిదికాదనమాట..!
చాలామంది తెలిసితెలియక చేసే తప్పుల వల్ల ప్రాణాలు కొల్పోతుంటారు. వర్షం తగ్గాక చిన్నపిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపడం కూడా సురక్షితం కాదు. వారు ఆడుకుంటూ..ఏ విద్యుత్‌స్తంబాన్ని ముట్టుకోవడం, ట్రాన్స్‌ఫార్మమ్ దగ్గరకు వెళ్లడం చేస్తుంటారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్నపిల్లలను ఎట్టి పరిస్థితుల్లో వర్షంలో బయటకు పంపొద్దని అధికారుల నుంచి వైద్యుల వరకూ అందరూ హెచ్చరిస్తున్నారు.
Attachments area