చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. బరువు తగ్గడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే బరువు తగ్గడానికి టాబ్లెట్లు ని వేసుకుంటూ ఉంటారు. ఇటువంటి టాబ్లెట్లు ని వేసుకోవడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఆరోగ్యానికి టాబ్లెట్లు అసలు మంచివి కాదు. ఇందులో కెఫీన్ వంటి మూలికలు రక్తపోటు, హృదయ స్పందన లో మార్పులు తీసుకు వస్తుంది.
ఏదైనా టాబ్లెట్ ని ఉపయోగించే ముందు కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి లేకపోతే అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది. వాటి వల్ల కలిగే లాభాలు కంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వీటిని తీసుకుంటే మానసిక ఆరోగ్యం కూడా పాడవుతుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఈ తప్పును చేయకండి. లివర్ సమస్యలు కూడా ఈ టాబ్లెట్ల వల్ల కలిగే అవకాశం ఉంది. కామెర్లు పొత్తికడుపు లివర్ ఫెయిల్ వంటి వాటికి దారి తీయొచ్చు.
డైట్ టాబ్లెట్స్ ని తీసుకుంటే జీవ క్రియ కూడా బాగా దెబ్బతింటుంది. ఆకలి తగ్గిపోతుంది. కొన్ని డైట్ టాబ్లెట్స్ హార్మోన్ సమతుల్యతని దెబ్బతీస్తాయి. ఆడవాళ్ళలో పీరియడ్స్ తప్పడం సంతనోత్పత్తి సమస్యలు కూడా ఈ పిల్స్ వల్ల కలగవచ్చు. ఈ టాబ్లెట్లు ని తీసుకోవడం వలన గుండె పని భారం పెరుగుతుంది. దడ, గుండెపోటు వంటి సమస్యలు కూడా కలగవచ్చు. కాబట్టి ఈ టాబ్లెట్స్ ని తీసుకోవడానికి బదులుగా డైట్ ని కంట్రోల్ చేసుకోవడం, వ్యాయామ పద్ధతులు పాటించడం మంచిది.