వయసు 30కి చేరిందంటే చాలు వయసు పెరిగిపోతున్నట్టు కనిపిస్తారు. అప్పుడే చర్మం అంతకుముందున్నంత మృదువుగా ఉండకుండా కఠినంగా మారుతుంది. లుక్స్ పరంగానూ చాలా మార్పులు వస్తాయి. కొన్ని సార్లు ఈ మార్పులు చాలా భయపెడతాయి. వయసు పెరుగుతుందన్న ఫీలింగ్ చాలా మందిని భయపెడుతుంది. వృద్ధాప్యం ఎలా ఉంటుందో కనిపిస్తున్న కారణంగా వయసు పెరగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎంత ఇబ్బందిగా ఉన్నా కాలాన్ని ఆపలేము. కానీ, మన చర్మాని సురక్షితంగా ఉంచుకునే వెసులుబాటు చాలా ఉంది.
30ల్లోకి అడుగుపెడుతున్నవారు. 30ల్లో జీవిస్తున్న వారు, 40ల్లోకి ఎంటర్ అవుతున్న వారు కొన్ని జాగ్రత్తలని పాటిస్తే, మీరున్న వయసు కంటే తక్కువగా కనిపించి ఉత్సాహాన్ని పొందవచ్చు.
దీనికొరకు ముందుగా ఏం చేయాలంటే,
శుభ్రపర్చడం
ఉదయం మేకప్ వేసుకోవడానికి ముందు ఎలా శుభ్రపర్చుకుంటారో, రాత్రి పడుకునే ముందు మేకప్ తీసివేసుకుని శుభ్రపర్చుకోవాలి. చర్మాన్ని శుభ్రపర్చుకుంటూ ఉంటే, కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి.
రక్షణ
విటమిన్ సి కలిగిన చర్మ సాధనాలని వాడితే చర్మం సురక్షితంగా ఉంటుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు చర్మానికి మేఉ చేస్తాయి. చర్మంపై బాక్టీరియా వల్ల కలిగే అనర్థాలను రాకుండా చూసుకుంటాయి.
నీళ్ళు
ఎన్ని చేసినా కావాల్సినన్ని నీళ్ళూ తాగకపోతే చర్మం తొందరగా ముడుతలు పడుతుంది. చర్మం తేమగా ఉండాలంటే శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి.
సన్ స్క్రీన్
బయటకి వెళ్ళేటపుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. లేదంటే సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి.