ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కవితతో పాటు అనిల్ కుమార్, సిబ్బంది మొబైల్ ఫోన్లన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే… కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకని ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్లూ విచారణకు సహకరించలేదని, అందుకే ఈడీ ఆమె ఇంటికి వెళ్లిందని అన్నారు. ఇకనైనా కవిత విచారణకు సహకరించాలని కిషన్ రెడ్డి సూచించారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదని, దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని ఆయన పేర్కొన్నారు.