దేశ సైన్యంలో పనిచేసే జవాన్లు, ఖారీదైన వస్తువులు, ఇతరాత్ర సామగ్రిలను కొనుగోలు చేయాలంటే అవి కేవలం కొన్ని పత్యేక క్యాంటీన్లల్లో మాత్రమే లభించేవి. దీంతో వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆయా ఆయా ప్రాంతాల్లో ఉన క్యాంటీన్లలోకి వెళ్లి తమకు అవసరమైన వస్తువులు, ఇంటి సామగ్రి తదితరాలంనింటినీ కొనుగోలు చేసుకునేవారు. కానీ.. ఇప్పుటి నుంచి అవన్నీ ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉండనున్నాయి.
అందుకోసం సీఎస్డీ ( క్యాంటీన్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్) లలో అభించేవన్నీ ఆన్లైన్లో లభించేలా శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి (http://afd.csdindia.gov.in)
అనే పోర్టర్‌ను ప్రారంభించారు. తద్వారా 45 లక్షల మంది ఆర్మీ సిబ్బంది ఏఎప్డీ–1కేటగిరీలోని వివిధ రకాల వస్తువులను ఈ పోర్టర్ ద్వారా కొనుగోలు చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.రీప్రిజిరేటర్, ఏసీ, టీవీ, ల్యాప్‌టాప్, వాషీంగ్ మెషీన్, ఓవేన్ తదితర వస్తువులన్నీ ఏఎఫ్‌డీ–1 కేటగిరీలోకి వస్తాయి. ఇకౖపై ఆర్మీ సిబ్బంది ఎక్కడ బయటకు రాకుండా విధుల్లోని విరామం సమయంలో వీటిని కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారికే కాక ఎక్స్ సర్వీస్మెన్లకు కూడా ఇది వర్తింస్తోందని అధికారులు తెలిపారు.