రైతులతో కేంద్రం చర్చలు విఫలం..మళ్ళీ ఎప్పుడంటే ?

-

కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయ్‌. 8వ దఫా చర్చల్లోనూ ఎలాంటి పురోగతి లేదు. ఢిల్లీలోని ప్రగతిభవన్‌లో 40 సంఘాల ప్రతినిథులతో కేంద్రమంత్రి తోమర్‌ సమావేశమయ్యారు.  ముఖ్యంగా రెండు కీలక అంశాలపై చర్చించారు. మూడు చట్టాల్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని కేంద్రానికి తేల్చి చెప్పారు. అయితే చట్టాల విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని తేల్చి చెప్పింది కేంద్రం.

ఈ చట్టాలు…దేశవ్యాప్తంగా అమలు జరుగుతాయని రైతు సంఘాలతో చెప్పింది. కావాలంటే రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఒకేవేళ అత్యున్నత న్యాయస్థానం వ్యవసాయ చట్టాల్ని తప్పుబడితే.. తాము వాటిని  ఉపసంహరించుకుంటామని చెప్పింది. దీంతో చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇప్పటి వరకు 8సార్లు కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరిగాయి. నాలుగు కీలక అంశాల్లో రెండింట్లో ఏకాభిప్రాయం కుదిరింది. ఢిల్లీ పొల్యూషన్‌ చట్టంలోని… రైతులకు మినహాంపు ఇచ్చింది. ఇక మరో సారి 15 వ తేదీన చర్చలు జరపనున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news