ఢిల్లీ : ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాపురించాయని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. ఈ విషయంపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలని.. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసకర పాలన సాగుతోందన్నారు.
జగన్ ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారు అని అనేక సార్లు మేము చెప్పిన విషయాన్ని కాగ్ నివేదిక మరోమారు స్పష్టం చేసిందని నిప్పులు చెరిగారు. 48 వేల కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చు పెట్టారు ఎలా పెట్టారు ఏమయ్యాయి అని , ట్రెజరీ కోడ్ ఉల్లంఘించారు అని కాగ్ పేర్కొందని గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సొంత కంపెనీ లాగా భావిస్తున్నారని.. రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డిపై కత్తులు దుసారు. నాయకత్వం లేదు, విజన్ లేదు ఒక కంపెనీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు, ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ల నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పన్నులు వేసి ప్రజలను పిండి పిండి చేస్తున్నారన్నారు.