ఇండియా వ్యవసాయ రంగంలో కొత్త విధానాన్ని అవలంభిస్తుంది. మన దేశం నుంచి పండే ఎన్నో ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వర్తక, వాణిజ్య, ఉద్యానవ ఉత్పత్తులకు మన దేశం పెట్టింది పేరు. పూల్ మఖానా, మామిడి, అనాసపళ్ళు, అరటి, డ్రాగన్ ఫ్రూట్ , కర్భూజా, టమాట వంటి అనేక రకాల వ్యవసాయోత్పత్తులను మన దేశం ఎగుమతి చేస్తుంది. ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అధికంగా పండే పంటల గురించి.. వాటిని ఏఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నారో చూద్దామా!
డ్రాగన్ ఫ్రూట్ లండన్ , దుబాయ్‌లకు ఎగుమతి:
మన దేశంలో పండుతున్న డ్రాగన్ ఫ్రూట్ ప్రపంచంలోని రెండు సంపన్న దేశాల రాజధానులైన లండన్, దుబాయ్‌లకు ఎగుమతి అవడం చాలా గొప్ప విషయం. గుజరాత్‌లో పండించే డ్రాగన్ ఫ్రూట్ లండన్‌కు ఎగుమతి అవుతుండగా, మహారాష్ట్రలో పండించే డ్రాగన్ ఫ్రూట్ దుబాయ్‌కి పంపుతున్నారట.
బీహార్ నుంచి మామిడి
ఇక్కడ పండే మామిడి పళ్ళను లిచ్చి యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)లో వారు బాగా ఇష్టపడుతున్నారు. భాగల్‌పూర్, జర్దాలు మామిడి, షాహి లిచ్చి లను యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)కి ఎగుమతి చేస్తున్నామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు.
బీహార్‌లో విస్తారంగా లభించే మఖానా
బీహార్ లో మామిడితో పాటు.. మఖానా కూడా విపరీతంగా పండుతుంది. ఇది జపాన్‌కు ఎగుమతి అవుతోంది. దీని వల్ల రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతుండగా, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతోంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా, మారుమూల ప్రాంతాల నుండి వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో తమదైన ముద్ర వేస్తున్నాయని.. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు.
ఇతర పండ్లకు కూడా మంచి గిరాకీ..
మన దేశంలో లభించే పండ్లకు విదేశాల్లో డిమాండ్ బాగుంది. మహారాష్ట్రలోని మరఠ్వాడాలో లభించే మామిడి.. యునైటెడ్ కింగ్‌డమ్ కి కూడా ఎగుమతి చేస్తున్నారు..బహ్రెయిన్ వాసులకు బెంగాల్‌లోని మామిడి పండ్లను ఇష్టపడతారు. మహారాష్ట్రకు చెందిన జల్‌గావ్ అరటి, దుబాయ్ , సింగపూర్‌లోని కేరళకు చెందిన నందన్ అరటి పండ్లను ఎగుమతి చేస్తారు. అదేవిధంగా కేరళలోని పైనాపిల్‌ను షార్జహాన్‌కు ఎగుమతి చేస్తారు.
కేరళ బెల్లం దుబాయ్ కి ఎగుమతి:
మన దేశంలో తయారయ్యే బెల్లం దుబాయ్‌కి ఎగుమతి అవుతుంది. కేరళలోని బిజ్నోర్ , ఇడుక్కిలలో తయారైన బెల్లం దుబాయ్ కి అధికంగా ఎగుమతి చేయబడుతుంది. అదేవిధంగా హిమాచల్ ఆపిల్ పండ్లు ఖతార్, బహ్రెయిన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన రాగి డెన్మార్క్ వాసులకు ఇష్టమైనదట.