జీవంలేని బొద్దింకలపై సజీవమైన చిత్రాలను గీస్తున్న ఆర్టిస్ట్..!

-

బొద్దింకలంటే..అందరీ భయం ఉంటుంది..అమ్మాయిలకైతే..ఈ బొద్దింకలు, బల్లులు చూస్తే..పాము చూసినట్లే హడావిడి చేస్తారు. ఇంట్లో బొద్దింకలు ఉంటే..వాటిని ఎంతసేపు ఎలా చంపాలా, ఎలా వదిలించుకోవాలా అనే చూస్తాం..అవును మరి అవి ప్లేట్స్ మీద పాకినా, తినే వస్తువుల మీద వాలినా మనకు మంచిది కాదు..అయితే..ఓ ఆర్టిస్ట్ మాత్రం చచ్చిన బొద్దింకలపై అందమైన చిత్రాలు వేస్తూ..కళకు కాదేది అనర్హం అని మళ్లీ ఓ సారి నిరూపించింది. ఇంతకీ ఎవరా ఆర్టిస్ట్, ఏం బొమ్మలు వేస్తుందో మీరు ఓ లుక్కేయండి.!

మనీలాలోని కలూకాన్ సిటీకి చెందిన 30 ఏళ్ల డెల్గాడో తన పని ప్రదేశంలో చనిపోయిన బొద్దింకలను ఊడుస్తూ ఉండేది..అలా ఊడ్చే క్రమంలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. డెల్గాడో స్వతహాగానే ఆర్టిస్ట్‌. బొద్దింకలు రెక్కలు నునపుగా మెరుస్తూ ఉంటాయి కదా వాటిని కాన్వాసుగా ఉపయోగించి ఎందుకు చిత్రించకూడదు అని అనుకుంది ఆమె..అంతే అనుక్కన్నదే తడువుగా ఆయిల్ పెయింట్‌ను ఉపయోగించి రకరకాల చిత్రాలను చిత్రించింది.

పైగా ఆ చిత్రాలు రచనల్లోని మార్వెల్స్ వెనమ్, గ్రీన్ గోబ్లిన్, విన్సెంట్ వాన్ గోహ్‌ స్టార్రీ నైట్ వంటి చిత్రాలకు సంబంధించిన అనుకరణ ప్రస్ఫుటంగా కనిపించింది. అంతేకాదు ‘భయపడకండి, అసాధ్యమైన పనులు చేయడానికి సదా సిద్దంగా ఉండండి’ అని అందరికీ పిలుపు ఇస్తోంది ఆమె. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా అయ్యింది. దీంతో నెటిజన్లు ఆమె కళను చూసి ఫిదా అవుతున్నారు.

మనలో నైపుణ్యం ఉంటే..ఎలాంటి వాటిపైన అయినా..అందమైన చిత్రాలను గీయొచ్చు..ఇప్పటికే చాలమంది..బియ్యం గింజలపైనా, చాక్ పీస్ పైనా, ఆకులపైన అందమైన చిత్రాలను గీసి ఔరా అనిపించారు. మనలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది..కానీ అది ఏంటి అనేది బయటపడానికే టైం పడుతుంది. కొన్నిసార్లు ఆ టాలెంట్ జీవితం ఎండ్ అయ్యే దశలో గుర్తించవచ్చు..మన తెలుగులోనే ఎంతమంది లేరు..ఆరుపదుల వయసులో ప్రపంచానికి పరిచయం అయిన బామ్మలు..తమ నటనతో, పాటలతో ఇప్పుడు వారికంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఇంతకీ మీలో ఉన్న ఆ స్పెషల్ నైపుణ్యం ఏంటో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా..ఏమో ఆ దిశగా అడుగులు వేస్తే..లైఫ్ యూటర్న్ తీసుకుంటుందేమో..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news