ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే బిజేపి కుట్రలు – కేజ్రీవాల్

-

“ఆప్” ని చీల్చి, ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్రలకు బిజేపి పాల్పడుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే… “ఆపరేషన్ కమలం” ను చిత్తు చేసేందుకు “ఆప్” ముందస్తు వ్యూహం రెడీ చేసింది. ఢిబిజేపి “ఆపరేషన్ కమలం” లో భాగంగా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఒక్కో “ఆప్” ఎమ్.ఎల్.ఏ కు 20 కోట్ల రూపాయలు ఇవ్వజూపారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ చేశారు.

గత వారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 62 మంది ఎమ్.ఎల్.ఏ లకు గాను, 53 మంది ఎమ్.ఎల్.ఏ లు ప్రత్యక్షంగా హాజరుకాగా, మిగిలిన వారు “ఆన్ లైన్” లో హాజరు కాలేదు. ఆ తర్వాత, జాతిపిత మహాత్మ గాంధీ సమాధి “రాజఘాట్” వద్దకు ఎమ్.ఎల్.ఏల తో సహా వెళ్లి, బిజేపి “ఆపరేషన్ కమలం” విఫలం కావాలని ప్రార్థన చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. “మొత్తం 40 మంది “ఆప్” ఎమ్.ఎల్.ఏ లకు ఎర వేసినట్లు సమాచారం అందుతోంది. అయినా ఏ ఒక్క ఎమ్.ఎల్.ఏ కూడా ప్రలోభాలకు లొంగనందుకు సంతోషంగా ఉందని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో మరికాసేట్లోనే తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు కేజ్రీవాల్‌.

Read more RELATED
Recommended to you

Latest news