దిశ మార్చుకున్న అసాని తుఫాన్‌.. ఏపీకి ముప్పు..

-

అసని తుపాను.. దిశ మార్చుకుంది. రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. తుపాను ప్రభావంతో.. ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా అసని దిశ మార్చుకున్న ప్రభావం.. కృష్ణా, గుంటూరు జిల్లాలపైనా పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ రెండు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫాన్ ప్రభావం వలన విశాఖ నగరంలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీవీఎంసీ కమిషనర్‌ నగర వాసులకు హెచ్చరికలు జారీ చేశారు.

Asani intensifies into cyclonic storm: Odisha, Bengal brace for impact -  India News

నగర ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాలలో నివసించే వారు, తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు,కొండవాలు ప్రాంతాల వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. హోర్డింగ్‌లు సమీపంలో, చెట్ల కింద ఉండరాదని, అత్యవసర సేవల కొరకు ప్రజలు GVMC టోల్ ఫ్రీ 1800 4250 0009 నంబరు కు కానీ, 0891 2869106 నంబరు కు కానీ ఫోన్ చేసి అత్యవసర సేవలు పొంద వచ్చునని జీవీఎంసీ కమిషనర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news