భాజపేతర శక్తుల కలయిక వేగం పెంచుతోంది. ఇప్పటికే పార్టీలను ఏకం చేసే బాధ్యతను తీసుకున్న చంద్రబాబు..జాతీయ స్థాయి నేతలతో పాటు, రాష్ట్రాల్లోని ప్రముఖ పార్టీల నాయకులను కూడగట్టే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే మొన్న శరద్ పవర్, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రివాల్, మయావతి తో భేటీ అయ్యారు. అన్నింటికంటే ముఖ్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా వైరం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కలిసి మద్దతు కోరారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఇందుకుగాను ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ను దూతగా శనివారం చంద్రబాబు దగ్గరకు పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తెదేపా అధినేత చంద్రబాబుతో సమావేశంకానున్నారు. ఈ భేటీలో కూటమికి సంబంధించిన అంశాలతో పాటూ తాజా రాజకీయాలపై చర్చించబోతున్నారు. రేపు జరగనున్న భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.