అశోక్ సెల్వన్ ‘ఆకాశం’ సినిమా టీజర్ విడుదల

-

అశోక్‌ సెల్వన్ తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు. నిన్నిలా నిన్నిలా, ఓ మై కడవులే వంటి తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశం’. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూవర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎక్కడ ముగుస్తుందనుకుంటున్నారో, అక్కడే ప్రారంభం అవుతుందనే వ్యాఖ్యతో సినిమా పోస్టర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన చిత్రబృందం తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవ్వనుంది. చెన్నై, హైదరాబాద్‌, విశాఖపట్నంతో పాటు, గోవా, దిల్లీ, కోల్‌కత్తా తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమాకు గోపిసుందర్‌ సంగీతం అందించారు. వయాకామ్‌18 స్టూడియోస్‌తో కలిసి రైజ్ ఈస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news