విద్యార్థులకు స్కూటర్లు గిఫ్ట్ ఇస్తున్న సర్కార్.. ఎక్కడంటే..?

-

సాధారణంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారి తల్లిదండ్రులు గిఫ్టులిస్తుంటారు. ప్రభుత్వాలైతే ప్రోత్సాహకంగా స్కాలర్ షిప్ లు అందిస్తుంటాయి. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించడానికి.. ఆ రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏకంగా స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంతకీ ఏ రాష్ట్రంలో అంటే..?

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని టాలెంటెడ్ విద్యార్థులను గుర్తించి వారికి భారీ కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. 12th స్టాండర్డ్ పాస్ అయిన వారిలో 36 వేల మంది విద్యార్థులను గుర్తించి వారికి స్కూటర్‌లు కానుకగా ఇవ్వనుంది. వీరిలో ఎక్కువగా లబ్ధి పొందేది బాలికలే. కేబినెట్ సమావేశంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయం ప్రకటించగా.. అందరూ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు ఇదే విషయాన్ని ప్రకటించారు.

రూ.258.9 కోట్ల వ్యయంతో ప్రతిభావంతులకు స్కూటర్లు పంచేందుకు వీలుగా కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించినట్టు మంత్రి రనోజ్ తెలిపారు. మొత్తం 35,800 మంది లబ్ధిదారులున్నట్టు వెల్లడించారు. వారిలో 29 వేల 768 మంది బాలికలు ఫస్ట్ డివిజన్‌లో పాస్‌ కాగా.. 6,052 మంది బాలురు 75% కన్నా ఎక్కువ మార్కులు సంపాదించారని స్పష్టం చేశారు. వీరందరికీ స్కూటర్లు అందించనుంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news