ఏపీ సీఎస్‌కు అస్వస్థత.. ఫోన్‌ ద్వారా పరామర్శించిన సీఎం జగన్‌

-

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత కారణాలతో అనారోగ్యానికి గురైన ఆయన ఇటీవల ఓ ఆసుపత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. తాజాగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కోలుకున్న తర్వాత మళ్లీ విధుల్లో చేరే అవకాశం ఉంది. సమీర్ శర్మను ముఖ్యమంత్రి జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. మరోవైపు సమీర్ శర్మ అస్వస్థతకు గురైన నేపథ్యంలో.. ఇంధనశాఖ ప్రత్యేక సీఎస్ కె.విజయానంద్ కు పూర్థి స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులను ఇచ్చారు.

CBI court to deliver order on plea against CM Jagan's bail on Sep 15 | The  News Minute

వచ్చే ఎన్నికల్లో 175 సీట్ల టార్గెట్ తో అడుగులు వేస్తున్న సీఎం జగన్ అభ్యర్ధుల ఎంపిక ప్రారంభించారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ ఇంఛార్జ్ లకు బాధ్యతలు అప్పగిస్తున్న ముఖ్యమంత్రి ..ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి అభ్యర్ధిని ఖరారు చేసారు. నియోజకవర్గంలో పార్టీలో సమస్యలపైన సీఎం కీలక సూచనలు చేసారు. అద్దంకి నియోజకవర్గం తనకు ప్రతిష్ఠాత్మకమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆ నియోజకవర్గాన్ని తాను ప్రత్యేకంగా చూస్తానని చెప్పారు. అక్కడ అందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news