BREAKING : అసెంబ్లీ ముట్టడించిన VRAలు.. పరిస్థితి ఉద్రిక్తం

-

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వందలాది మంది VRAలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే… ఇందిరాపార్క్, తెలుగు తల్లి ఫ్లయి ఓవర్ దగ్గర 200 మంది VRA లను అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే.. అసెంబ్లీ పరిసర ప్రాతంలో ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన పోలీసులు.. నాంపల్లి నుండి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను దారి మల్లిస్తున్నారు. దీంతో VRA ల ఆందోళన ఉదృతం అయింది.

నిన్న అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో ఆందోళనలో vra లు ఉన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో pay స్కెల్ ప్రకారం జీతం ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారంటూ ఆరోపణలు చేస్తున్నారు VRA లు. Pay స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని నిరసనకు దిగారు. కేవలం 12 వేల లోపే ప్రస్తుతం జీతం వస్తూండడంతో ఇబ్బందిగా ఉందంటున్నారు vra లు. ఇతర శాఖలో vra లను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటన చేయడంతో…సిటీలో ఆందోళనకు దిగారు. ఈ మేరకు అసెంబ్లీ ముట్టడికి vra లు తరలించారు. దీంతో అసెంబ్లీ దగ్గర పరిస్థితి ఉద్రక్తతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news