కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇందులో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మూడు రాష్ట్రాల ప్రస్తుత శాసనసభల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికలపై రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాజపా అధికారంలో ఉంది. త్రిపురలో మాణిక్ సాహా నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఉండగా.. మేఘాలయ, నాగాలాండ్‌లో కాషాయ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది.