రాక్షసుడు రీమేక్ చేసిన నాగశౌర్య…! అశ్వథ్థామ ట్విట్టర్ రివ్యూ…!

-

సరిగా రెండేళ్ళ క్రితం చలో సినిమాతో హిట్ కొట్టాడు నాగశౌర్య. అయితే ఇప్పటి వరకు అతని సినిమాలు అన్నీ కూడా క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. దీనితో అశ్వథ్థామ సినిమాకు తానే కథ రాసుకుని మరీ మాస్ ఆడియన్స్ కోసం సినిమా చేసాడు. ఈ సినిమా ద్వారా క్లాస్ ప్రేక్షకులనే కాదు మాస్ ని కూడా ఆకట్టుకోవాలని భావించాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్స్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యాయి.

అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే టాక్ ఎక్కువగా వస్తుంది. బెల్లం బాబు అదే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా లైన్ తోనే దాదాపుగా ఉందని రొటీన్ సినిమా అని అంటున్నారు చూసిన వాళ్ళు,. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే పట్టుదలతో ఆ విధంగానే కథ రాసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ట్విస్ట్ లు ఉన్నా లాజిక్ లు లేకపోవడంతో సినిమా తేలిపోయింది అంటున్నారు.

ఇలాంటి కథను ఇప్పటికే ప్రేక్షకులు చూసేయడంతో… స్క్రీన్ ప్లే కూడా అంత ఆకట్టుకోలేదని అంటున్నారు. కొన్ని సన్నివేశాలు అయితే ఆకట్టుకున్నాయని సినిమా స్టార్టింగ్ లో కాస్త రొటీన్ అనే టాక్ వచ్చినా క్రమంగా ఆసక్తిగా తీసుకువెళ్ళాడు. అయితే హీరో ఇచ్చిన కథలో మాత్రం దర్శకుడు రమణ తేజా కొన్ని మార్పులు చేసుకోవడంతో సినిమా కాస్త ఆకట్టుకుందని లేకపోతే అట్టర్ ఫ్లాప్ అయి ఉండేదని అంటున్నారు.

రాక్షసుడు సినిమా మాదిరిగానే అమ్మాయిలను చంపడం ఆ తర్వాత క్లూ లేకుండా పోలీసులు కేసులు వదిలేయడం… వాటిని హీరో చేధించడం అన్నీ కూడా బెల్లం బాబు సినిమాను పోలి ఉన్నాయి. దీనితో ఈ సినిమాలో అంత స్పెషల్ ఏమీ లేదని, అయితే హీరో భావించినట్టు ఈ సినిమా మాస్ కి దగ్గరవుతుందో లేదో చూడాలని అంటున్నారు. అయితే ఒకసారి చూడవచ్చని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news