కొద్దిరోజుల క్రితం ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ రిమాండును పొడిగించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొడుతున్న అచ్చెన్నాయుడు కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు.
పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. వారందరి మధ్య నుంచే ఆయనను విజయవాడ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. అచ్చెన్నాయుడు విషయంలో తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఏసీబీ కోర్టు.. ఈ నెల 3న తమ నిర్ణయాన్ని వెల్లడించనుంది.