మమతా బెనర్జీ ఫేక్ ముచ్చట్ల వెనుక ఉంది పీకేనే.. వైసీపీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసిందని సుప్రీం కోర్టు కు వెళ్ళినప్పుడు, పార్లమెంటు లో చర్చ పెడితే విజయ సాయి రెడ్డి కేసులకు భయపడి మోడీకి సలాం కొట్టి చర్చ వద్దన్నారని ట్వీట్ చేశారు అచ్చెన్నాయుడు.
కానీ ప్రశాంత్ కిషోరుకి చెప్పి చంద్రబాబు మీద బురద జల్లడానికి మమత బెనర్జీతో ఫేక్ మాటలు చెప్పించారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇక్కడ అసెంబ్లీ లో మాత్రం చర్చ కావాలంటున్నా అని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. అధికారంలో ఉన్నది మీరే కదా..? దమ్ముంటే నిజానిజాలు ప్రజల ముందుంచండని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు మీద బురద జల్లుతాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మీకు తగిన విధంగా బుద్ది చెబుతామని వైసీపీ పార్టీకి వార్నింఘ్ ఇచ్చారు. వైసీపీ పార్టీకి త్వరలోనే పరాభవం తప్పదన్నారు.