24 లక్షలతో ఉన్న ఏటీఎం వరదల్లో కొలాప్స్‌..

-

భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరాఖండ్‌లో వరదల కారణంగా ఓ ఏటీఎం నీటిలో కొట్టుకుపోయింది. అది కొట్టుకుపోవడానికి ముందు బ్యాంకు అధికారులు అందులో రూ. 24 లక్షలు జమ చేశారు. నదిలో అది కొట్టుకుపోయే సమయానికి ఖాతాదారులు ఎంత జమచేశారన్న వివరాలు తెలియరాలేదు. ఉత్తరాఖండ్‌లో జరిగిందీ ఘటన. ఉత్తర కాశీ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో కుమోలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

పురోలా పట్టణంలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నదిలో కొట్టుకుపోయాయి. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కూడా ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. అంతకుముందే అందులో రూ. 24 లక్షలకు జమచేసినట్టు చెప్పారు. ఏటీఎం నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news