హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ స్కూల్‌లో… పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి.

we are hiring

ఈ స్కూల్‌లో టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టీజీటీ, పీఆర్‌టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బయోలజీ, కెమిస్ట్రీ, సోషల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ/ ఫిజిక్స్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇక వయస్సు విషయానికి వస్తే.. టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 45 ఏళ్లు మించకూడదు. అర్హత చూస్తే.. టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, బీఈడీ/ డిప్లొమా ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. ఇక పీఆర్‌టీ పోస్టులకు సంబంధించి వివరాలను చూస్తే.. పీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సీనియర్‌ సెకండరీ/ హయ్యర్‌ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్‌ టెస్ట్‌/ ఇంటర్‌/ డీఈఐఈడీ/ బీఈఐఈడీ/ డీఈడీ/ బీఈడీ ప్యాస్ అయ్యి ఉండాలి.

ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే.. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. శాలరీ వివరాల లోకి వెళితే.. టీజీటీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 26, 250, పీఆర్‌టీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 21,250 చెల్లిస్తారు.

సెక్యూరిటీ ఆఫీస్‌, డీఏఈ కాలనీ, డీ సెక్టార్‌ గేట్‌, కమలానగర్‌, ఈసీఐఎల్‌, హైదరాబాద్‌ 50062 అడ్రస్‌కు అప్లై చెయ్యాల్సి వుంది. అప్లై చెయ్యడానికి 26-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలను http://www.aecshyd2.edu.in/ లో చూడచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news