ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఇద్దరి ప్రాణాలను తీసింది. అయితే కర్నూల్ జిల్లాలోని కౌతాళం మండలం కామవరంలో ఈ ఘటన జరిగింది. కాగ కామవరం గ్రామంలో గురువారం భూముల అంశంపై గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త రాజకీయ రగడగా మారింది. వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన శివప్ప, ఈరన్న అనే దళితులు మృతిచెందారు.
బీజేపీ కి చెందన పలువురు కార్యకర్తలు వేట కొడవళ్లతో శివప్ప, ఈరన్న లపై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే శివప్ప.. కామవరం గ్రామ సర్పంచ్ సోదరుడని పోలీసులు తెలిపారు. కాగ ఈ ఘర్షణలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆదోని లోని ఆస్పత్రికి తరలించారు. కాగ ఘటనా స్థలానికి ఎస్పీ సుధీర్ వెళ్లి పరిశీలించారు. కాగ హత్యా నిందితులు పరారీలు ఉన్నట్టు తెలుస్తుంది. కాగ నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.