నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. మహిళ మర్మాంగంపై నిప్పంటించిన వైనం..!

-

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పనికి రావడం లేదని  చెంచు తెగకు చెందిన మహిళ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పాశవిక దాడి చేశాడు ఓ దుర్మార్గుడు.  నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో బాధితురాలు చెంచు మహిళ ఈశ్వరమ్మ, భర్త ఈదన్న తమ వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చారు.  ఆ భూమిలో వెంకటేశ్‌ ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రం పెట్టుకోగా.. తన దగ్గరే ఈదన్న, బాధితురాలు ఈశ్వరమ్మ పని చేసేవారు.

ఒక రోజు భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఈశ్వరమ్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఈశ్వరమ్మ పనికి రావట్లేదని యజమాని వెంకటేష్.. ఈశ్వరమ్మను పుట్టింటి నుంచి తీసుకొచ్చి తన దగ్గరే గదిలో బంధించి పాశవికంగా దాడి చేశాడు. ఈశ్వరమ్మ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి, కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వరమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news