సజ్జల భార్గవ్ మీద తప్పుడు ప్రచారం

-

వైసీపీ సోషల్‌ మీడియా వ్యవహారాల నుంచి ఇన్‌చార్జి సజ్జల భార్గవరెడ్డి తప్పుకున్నారా…అంటే అవునని వాదిస్తోంది ఎల్లో మీడియా.ఉన్నది లేనట్టు…లేనిది ఉన్నట్టు వండి వార్చడంలో ఆ మీడియాకు సాటి లేదు.ఎప్పుడూ వైసీపీ పై ఆ పార్టీ అనుబంధ విభాగాలపై తప్పుడు ప్రచారాలు చేపట్టే ఎల్లో మీడియా మరోసారి వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసింది. ఇంచార్జ్ అయిన సజ్జల భార్గవరెడ్డిపై అసత్య ప్రచారానికి తెరలేపింది.వైసీపీ వ్యవహారాలకు భార్గవ్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు…వైసీపీలోనే విస్తృత ప్రచారం జరుగుతోందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ సోషల్‌ మీడియా క్రియాశీలంగా లేదు.ప్రజలకు మంచి చేసిన పార్టీకి ఊహించని షాక్ తగలడంతో లోటుపాట్లపై వివిధ విభాగాలలో వైసీపీ అధ్యక్షులు జగన్‌ వరుస సమీక్షలు జరుపుతున్నారు. త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ సమీక్షలకు భార్గవ్ తండ్రి,ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి రోజూ హాజరవుతున్నారు.కానీ ఎల్లో మీడియా మాత్రం భార్గవ్ పై అసత్య ప్రచారం చేస్తోంది.పైగా వైసీపీలోనే భార్గవ్ పై చర్చలు జరుగుతున్నాయని చెప్పేస్తోంది. భార్గవ్ ని పక్కనపెట్టి ఆ బాధ్యతను నాగార్జున యాదవ్‌కు జగన్‌ అప్పగించారని అంటున్నారు.

మొన్నటి ఎన్నికల్లో జగన్‌ ఓడిపోవడంతో.. తమపై నాడు పెట్టిన పోస్టింగ్‌లపై ఫిర్యాదు చేసేందుకు కొత్త హోం మంత్రి వంగలపూడి అనిత, ఇతర టీడీపీ మహిళా నేతలు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల భార్గవ వైసీపీ సోషల్ మీడియా వ్యవహరాలకు దూరంగా ఉంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పైగా, భార్గవ నేతృత్వంలోని సోషల్ మీడియా అతి కూడా వైసీపీ పతనానికి ఓ కారణమనే విశ్లేషణల నేపథ్యంలో జగన్ సైతం భార్గవను పట్టించుకోవడం లేదని అందుకే ఆయన స్థానంలో నాగార్జున యాదవ్ కు సోషల్ మీడియా విభాగం బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.అయితే ఇందులో వాస్తవాలు లేవని వైకాపా నేతలు అంటున్నారు.భార్గవ్ రెడ్డి వైసీపీలోనే ఉన్నారని చెప్తూ ఎల్లో మీడియా వాదనలను కొట్టి పారేశారు.

Read more RELATED
Recommended to you

Latest news