విశాఖలో దారుణం జరిగింది. బాలికపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేసాడు. విశాఖ త్రీ పీఎస్ పరిధిలోని వినాయక్ నగర్ లో ఈ ఘటన జరిగింది. పదేళ్ల బాలికపై అత్యాచారానికి డెలివరీ బాయ్ చంద్రశేఖర్.. పాల్పడ్డాడు. అయితే ఈ సంఘటన పై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

దింతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పూణె – షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో బుధవారం రాత్రి 7:30 గంటలకు పార్సిల్ ఇవ్వడానికి వెళ్లి యువతి(22)పై అత్యాచారం చేసాడు డెలివరీ బాయ్. పార్సిల్ ఇచ్చి ఓటీపీ చెప్పమని అడగగా మొబైల్ తెచ్చుకునేందుకు ఇంట్లోకి వెళ్ళింది యువతి. అదే అదునుగా చూసి ఇంట్లోకి వెళ్లి డోర్ వేసి యువతి మొహంపై పెప్పర్ స్ప్రే కొట్టాడు డెలివరీ బాయ్. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆమెపై అత్యాచారం చేసాడు.