ఈ మధ్య స్కూల్లల్లో మతాలకు సంబంధించిన గొడవలు ఎక్కువైపోతున్నాయి..మొన్నటివరకూ హిజాబ్ ఇష్యూ నడిచింది.. ఇప్పటికీ అది వివాదంలోనే ఉంది. హల్లెలుయా అనలేది ఒకరు, జై శ్రీరామ్ అనలేది మరొకరు..ఇలా వారు విద్యార్థుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. జై శ్రీరాం అనలేదని ముస్లిం బాలుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
పోలీసులు, బాధిత బాలుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఖండ్వాలో పదేళ్ల ముస్లిం బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ట్యూషన్‌కు వెళ్తున్న ముస్లిం బాలుడిని 22 ఏళ్ల వ్యక్తి అడ్డగించి బాలుడిని జై శ్రీరాం అనాలని ఒత్తిడి చేసి వేధించాడు. ఆ బాలుడు మౌనంగా ఉండటంతో అతనిపై చెంపపై కొట్టాడు. దీంతో మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన నిందితుడిపై పంధానా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బాలుడు ట్యూషన్‌కు వెళ్తుండగా అజయ్ అలియాస్ రాజు భిల్ అనే వ్యక్తి అతడిని అడ్డగించి జై శ్రీరాం అనాలని బలవతం చేయడంతోపాటు దాడి చేశాడని బాధితుడి తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఖండ్వా డీఎస్ పీ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. కొడంగల్‌లో భైరీ నరేష్ అనే వ్యక్తి హిందూ దేవుళ్లను కించపరిచేలా ఓ సభలో ప్రసగించాడు.. అంతే.. అతన్ని కఠినంగా శిక్షించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్పమాలధారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేశారు. సోషల్ మీడియాలో ఆ నరేష్ అనే వ్యక్తిని పట్టుకోని రోడ్డుపై కొడుతున్నట్లు వీడియోలు కూడా వచ్చాయి. అసలు జనాలు ఎందుకిలా ఉంటారో.. ఎవరి మతం వారికి గొప్ప.. అలా అని ఇతురుల మనోభావాలను దెబ్బతీయొచ్చా..? నీకు నచ్చకుంటే చేయకు అంతేకానీ.. వాళ్లను అనే హక్కు, అనమనే రైట్ మీకు ఎవరిచ్చారు.. మొదటి ఘటనలో ఆ వ్యక్తి జై శ్రీరామ్ అనమని ఓ ముస్లిం కుర్రాడిని బలవంతం చేయడం ఎంత తప్పో.. ఇక్కడ భైరి నరేష్ కూడా హిందూదేవుళ్లను ఇలా కించపరిచేలా మాట్లాడటం కూడా అంతే తప్పు.. ఏమంటారు..?