దేవాలయాలపై దాడులు బాబు పనే… గతం చెబుతున్న మాట!

-

దేవాలయాల్లో ప్రమాధాలు, విగ్రహాల ధ్వంశాలు వంటి సమస్యలు ఎప్పుడూ లేనిది కాదు.. మునుపెన్నడూ జరగనిదీ కాదు.. కాకపోతే మరో దారి లేక ఏపీలో బీజేపీ – టీడీపీలు వాటిని బూతద్దాల్లో చూస్తున్నాయి అనేది విశ్లేషకుల మాట. అందుకు తాజాగా ఉదాహరణగా టీడీపీ – బీజేపీల ఉమ్మడి ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు నియోజకవర్గం పరిధిలోనే రథం తగలబడిన సంఘటనను గుర్తుచేస్తున్నారు! వాటిని ప్రమాధాలుగా చూడాలని చెబుతున్నారు. అయితే… ఏపీ మంత్రుల మాట మరోలా ఉంది!

చంద్రబాబు గతం తెలిసినవారెవరైనా… బ్రిటిష్ వాళ్లు వదిలేసిన డివైడ్ అండ్ రూల్ పాలసీని బాగా ఒంటపట్టించుకున్న రాజకీయ నాయకుడిగానే చెబుతుంటారు! ఇదే సమయంలో యూజ్ అండ్ త్రో కు కూడా ఆయన ఒక బలమైన ఉదాహరణ అనేది కూడా చాలామంది చెప్పే మాట! ఈ క్రమంలో.. ఇప్పుడు హిందువులూ – క్రైస్తవుల మధ్య కూడా బాబు పుల్లలు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు, అనుమానిస్తున్నారు ఏపీ మంత్రులు!

గతంలో ఎస్సీలుగా వర్గాలు లేకుండా కలిసిఉన్న మాల – మాదిగ కులాల మధ్య కూడా వర్గీకరణ మాటచెప్పి పబ్బం గడుపుకున్న చరిత్ర బాబు సొంతం అనేది వైకాపా నేతలు చెబుతున్న మాట. అసెంబ్లీ సాక్షిగా ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణస్వామి చెప్పినమాట కూడా ఇదే! అలాగే ఇప్పుడు ఇలాంటి పనులకు ఒడిగడుతున్నాడని.. ఇది త్వరలోనే నిగ్గు తేలుతుందని బొత్సా సత్యనారాయణ చెబుతున్నారు!

ఇదే విషయాలపై స్పందించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత… దేవాలయాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం… ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి విమర్శించేందుకు ఏమీ లేక టీడీపీ వంటి ప్రతిపక్షాలు కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నాయని.. ప్రభుత్వం ఈ కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు చర్యలు మొదలుపెట్టిందని.. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెబుతున్నారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news