పది రోజుల క్రితం కిడ్నాపయ్యి బయటపడ్డాడు .. అయినా చావు తప్పలేదు !

పది రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తన ఆసుపత్రి లోపల ఉన్న డాక్టర్ ని దుండగులు అక్కడి నుంచి బలవంతంగా ఎత్తుకు వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తం చేసి తెల్లారేలోపు డాక్టర్ని అనంతపురం వద్ద సేఫ్ గా కాపాడగలిగారు. అయితే ఈ కిడ్నాప్ కి ప్లాన్ చేసింది బాగా తెలిసిన వ్యక్తి అని అది కూడా బంధువని తేలడంతో జనాల్లో కాస్త ఆసక్తి రేకెత్తించింది.

అయితే మరి కొంతసేపు పోలీసులు కనిపెట్టకుండా వుండి ఉంటె చంపేసేవారేమోనని భయపడ్డారు కూడా. అయితే సదరు డాక్టర్ ఇప్పుడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున డాక్టర్ హుసేన్ కు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నగరంలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కిస్మత్ పూర్ లోని ప్రెస్టేజ్ విల్లాస్ లో డాక్టర్ హుస్సేన్ నివాసముంటున్నారు.