ఉమ్మడి నల్గొండ జిల్లాలోని షౌలి గౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై బిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. బొడ్రాయి పండుగ కోసం ఇటికల పాడుకు వెళ్లిన కోమటిరెడ్డి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటుకలపాడు కి రావడానికి మూడు గంటల సమయం పట్టిందని, కోటి రూపాయలు పెడితే రోడ్డు వేయచ్చని అన్నారు.
ప్రగతి భవన్, సచివాలయాలు కట్టొచ్చు కానీ రోడ్డు వేయలేరా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. ఈ వ్యాఖ్యలతో బిఆర్ఎస్ కార్యకర్తల కోపం కట్టలు తెంచుకుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కుర్చీలు, కర్రలతో దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.