బాలనటిగా ,చిన్నారి పెళ్లికూతురుగా ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యింది అవికా గోర్. వరుసగా అనేక సీరియల్స్ లో నటించి ఆమె మరింతగా గుర్తింపు తెచ్చుకుంది. బాలనటిగానే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అందుకే ఈ బ్యూటీ భాషలకు అతీతంగా ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగులోఉయ్యాలా జంపాలా` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకుంది.
తర్వాత వరుసగా `లక్ష్మీ రావే మా ఇంటికి`, `సినిమాచూపిస్తా మావా` హ్యాట్రిక్ విజయాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత చేసిన `తను నేను`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `రాజుగారి గది సినిమాలు ప్లాప్ కావటం తో మళ్లీ అవికా కెరియర్ కు బ్రేక్ పడింది.
ఇటీవల `టెన్త్ క్లాస్ డైరీస్` సినిమాలో , అలాగే నాగచైతన్యతో `థ్యాంక్యూ` సినిమా చేసింది. అయినా కూడా తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి.అంతకు ముందు హోమ్లీ బ్యూటీగా మెప్పించిన అవికా ఇప్పుడు అందాల ఆరబోతకి సిద్ధమే అంటోంది. పొట్టిదుస్తుల్లోనూ మెరుస్తూ నేనున్నా అంటూ మెల్లిగా గ్లామర్ బండి గేర్లు మారుస్తోంది.తాను ఎలాంటి పాత్రల్లోనైనా చేసేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తోంది. అలా అయినా ఆమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.