వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సీబీఐ అధికారులు చేతికి వచ్చాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కీలక నిందితుడని సిబిఐ అధికారులు ప్రాథమిక విచారణకు వచ్చే సమాచారం అందుతోంది.
అయితే తాజాగా ఈ హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో సిబిఐ డిఐజి కూడా పులివెందులకు వచ్చారు. ఆయన కీలక అరెస్టులు నిర్వహించే వరకు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. దస్తగిరి అప్రూవర్ గా కోర్టు అనుమతించిన తర్వాత మరోసారి న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.
ఇది మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆ వాంగ్మూలం నమోదు చేయించిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబం లో కీలక వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. గత డిసెంబర్ లోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా… అది కుదరలేదు. అయితే తాజాగా మరోసారి సీబీఐ అధికారులు దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.