హైదరాబాద్ లో డ్రంక్ డ్రైవ్ రద్దు…?

-

కరోనా వైరస్ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఎక్కడిక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అటు ప్రజలు కూడా ఈ విషయంలో చాలా వరకు అప్రమత్తంగానే ఉంటున్నారు. ఎక్కడిక్కడ మాస్కులు లేకుండా బయటకు రావడం లేదు ప్రజలు. ఎవరైనా అనుమానం ఉంటే చాలు ఆస్పత్రికి వెళ్ళిపోతున్నారు. ప్రత్యామ్నాయంగా మరో ఆస్పత్రిని ఏర్పాటు చెయ్యాలని చూస్తున్నారు.

ఇక సాధారణ రోగులు కూడా ఏదైనా అర్జెంట్ అయితే మినహా ఆస్పత్రికి రావడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో రాష్ట్ర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ని రద్దు చేసారని ప్రచారం జరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్ సహా బంజారా హిల్స్,జుబ్లీ హిల్స్ ప్రాంతాల్లో దీనిని రద్దు చేసారు అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందని,

అందుకే డ్రంకెన్ డ్రైవ్ చేపట్టడం లేదని వార్తలొచ్చాయి. ఈ నేపధ్యంలో హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ స్పందించారు. ఆ మాటల్లో నిజం లేదని అన్నారు. ఎవరికి వారికి ప్రత్యేక స్ట్రాలతో డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆ ప్రచారం నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కరోనా భయం ఉన్నప్పటికీ టెస్టులు చేసే క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. అవి అన్నీ అపోహలు అని కొట్టిపారేశారు.

Read more RELATED
Recommended to you

Latest news