శృంగారంలో రెచ్చిపోవాలంటే ఆయుర్వేదం చెప్పే ఈ ఆహారాలను తీసుకోండి..

శృంగారం జీవితంలో ఆహారం ప్రాముఖ్యత చాలా ఉంటుంది. మీరు తీసుకునే ఆహారాలు శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సరైన ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే సంతాన సమస్యలు, అంగస్తంభన ఇబ్బందులు, కోరికలు కలగపోవడం, భావప్రాప్రి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఐతే దీనికోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యి

నెయ్యి శరీర కణాలను ఉత్తేజపరుస్తుంది. సెక్స్ లైఫ్ లో ఇది చాలా ముఖ్యం. అందుకే రోజువారి జీవితంలో నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోండి.

తేనె

తేనెలో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లను ఉత్తేజపరిచే శక్తి ఉంది. ఇవి సెక్స్ లైఫ్ ని ప్రేరేపించే ముఖ్యమైన హార్మోన్లు.

వీటి లోపం కారణంగా శృంగార జీవితంలో అనేక ఇబ్బందులు వస్తుంటాయి. సంతాస సమస్యలు, కోరికలు లేకపోవడం మొదలైనవి సమస్యలు వస్తాయి. అందుకే తేనెని ఆహారంలో భాగం చేసుకోండి. శృంగారంలో రెచ్చిపోండి.

పాలు

పడక మీద రెచ్చిపోవడానికి పాలని మించిన ఆహారం లేదు. అందుకే ఆనాటి ఈనాటి వరకు శోభనం గదిలో పాలు గ్లాసుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉండే అనేక పోషకాలు తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల ఇక రెచ్చిపోవచ్చు. అదీగాక పాలకి మరికొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపితే ఆ ఎనర్జీ డబుల్ అవుతుంది.

పాయసం

పండ్లు, కుంకుమ పువ్వు, పాలు, యాలకులు మొదలైన వాటితో తయారయ్యే పాయసం సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది శృంగార జీవితంలో రసానుభూతిని పొందేందుకు చాలా ఉపయోగపడుతుంది.