చిన్నవయసులో వచ్చే తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే ఆయుర్వేద చిట్కాలు

-

ఈరోజుల్లో తెల్ల జుట్టు లేని యువత ఉండటం లేదు. ఒకప్పుడు మన ఇంట్లో అమ్మమ్మలు, అమ్మలు కోసం కలర్‌ కొనేవాళ్లం.. ఇప్పుడు వాళ్లతో పాటు మనం కూడా కొంటున్నాం. ఏం చేస్తాం పెద్దోళ్లు కలర్‌ వేసుకోుకున్నా పర్వాలేదు.. కాలేజ్‌కు, ఆఫీస్‌కు వెళ్లేవాళ్లు ఇలా వైట్‌ హెయిర్‌ పెట్టుకోని వెళ్తే అస్సలు బాగోదు. మన మీద మనకే సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ తగ్గిపోతుంది. చిన్న వయసులో వచ్చిన తెల్లజుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు ఉన్నాం. ఇవన్నీ మస్త్‌ చూసినాం అని లైట్‌ తీసుకోకండి. ఇది పక్కా పనిచేస్తుంది.! ఇప్పటికే చాలా మంది ఈ ట్రిక్‌ వాడి మంచి రిజల్ట్‌ పొందారు.

కొబ్బ‌రినూనెను 250 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. అందులో 10 ఎండు ఉసిరికాయ ముక్క‌ల‌ను వేయాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని స‌న్న‌ని మంట‌పై వేడి చేయాలి. ముక్క‌లు మెత్తబ‌డి పూర్తిగా నూనెలో క‌లిసిపోతాయి. అప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి. దీంతో నూనె త‌యార‌వుతుంది. దీన్ని వ‌డ‌క‌ట్టి గాజు సీసాలో నిల్వ చేయాలి. ఈ నూనెను త‌ర‌చూ రాస్తుండ‌డం వ‌ల్ల తెల్లు జుట్టు స‌మ‌స్య త‌గ్గుతుంది. జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాదు.. ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.

గోరింట‌, మందార కూడా ఎంత‌గానే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇందుకుకోసం 100 గ్రాముల గోరింటాకు, 2 తాజా మందార పువ్వులు (ఒంటి రెక్క‌), 20 గ్రాముల వేపాకు, అర ముక్క క‌ర్పూరం బిళ్ల‌, 250 ఎంఎల్ కొబ్బ‌రినూనెను తీసుకోవాలి. అన్నింటిని క‌లిపి స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. బాగా మ‌రిగాక చ‌ల్లార్చి వ‌డ‌క‌ట్టాలి. అనంత‌రం వ‌చ్చే నూనెను గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని వారంలో రెండు సార్లు వాడాలి. త‌ల‌కు కాస్త నూనె తీసుకుని బాగా ప‌ట్టించాక గంట సేపు ఉండి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే ఎలాంటి జుట్టు స‌మ‌స్య‌లు అయినా స‌రే త‌గ్గుతాయి.

జుట్టు స‌మ‌స్య‌ల‌కు అల్లం కూడా చక్క‌గా ప‌నిచేస్తుంది. ఇందుకు కోసం 50 గ్రాముల అల్లం తీసుకుని శుభ్రం చేయాలి. అనంత‌రం అల్లంను తుర‌మాలి. ఇందులో పావు కిలో తేనె వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డునే తినాలి. ఇలా చేస్తుంటే ఎలాంటి జుట్టు స‌మ‌స్య‌లు అయినా స‌రే త‌గ్గుతాయి, తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news