ఎన్టీఆర్ కుమార్తెలను అవమానపర్చడం ఘనతగా భావిస్తున్నావా సాయి రెడ్డి? అని అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చాడు. ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఉమామహేశ్వరి మరణంపై అనుమాలున్నాయని.. మా చంద్రన్న వేధించాడా ? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా ? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు. CBI దర్యాప్తు కోరి నిజం నిజం నిగ్గు తేల్చాలి బాబన్నా అంటూ చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు అయ్యన్న పాత్రుడు సెటైర్లు పేల్చారు.
కోడికత్తి నటన, గుండెపోటు డ్రామా, తల్లిని తరిమేయడం, చెల్లిని దిక్కులేని బాణంలా వదిలేయడం.. ఇవ్వన్నీ జగన్ రెడ్డి ట్రేడ్ మార్క్ సాయి రెడ్డి. సీబీఐ ఎంక్వైరీ ఎక్కడ నుండి మొదలు పెడదాం? కొడికత్తి డ్రామా నుండా లేక నీ అల్లుడు సారా కంపెనీల నుండా? అని చురకలు అంటించారు. ఎన్టీఆర్ గారి కుమార్తెలను అవమానపర్చడం పెద్ద ఘనతగా భావిస్తున్నావా సాయి రెడ్డి? ముందు ఇంట్లో ఉన్న అమ్మని, చెల్లిని గౌరవించమని మీ జగన్ రెడ్డికి ట్వీట్లు పెట్టు అని మండిపడ్డారు.
కోడికత్తి నటన, గుండెపోటు డ్రామా, తల్లిని తరిమేయడం, చెల్లిని దిక్కులేని బాణంలా వదిలేయడం.. ఇవ్వన్నీ జగన్ రెడ్డి ట్రేడ్ మార్క్ సాయి రెడ్డి. సీబీఐ ఎంక్వైరీ ఎక్కడ నుండి మొదలు పెడదాం? కొడికత్తి డ్రామా నుండా లేక నీ అల్లుడు సారా కంపెనీల నుండా? ఎన్టీఆర్ గారి కుమార్తెలను అవమానపర్చడం ,1/2 pic.twitter.com/xoNLjCEcKM
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) August 3, 2022