కామారెడ్డి జిల్లా : తెలంగాణ టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పని చేస్తున్నామని.. అధిష్టానం ఆదేశాల మేరకు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ఆయన ప్రకటన చేశారు.
కామారెడ్డి నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తానని స్పష్టం చేశారు అజారుద్దీన్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారని.. కామారెడ్డిలో మదన్ మోహన్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు.
పెరుగుతున్న ధరలు పేదల మీద భారం మోపిందని.. పెంచిన విద్యుత్ ధరలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రో డీజిల్ ధరలపై సబ్సిడీ ఇవ్వాలని.. పార్టీ ఆదేశాల మేరకు 6 వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేస్తామని ప్రకటన చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దించే దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు.