హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ ఫైర్

-

హైదరాబాద్: హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ ఫైర్ అయ్యారు. ఉద్దేశ పూర్వకంగానే తనకు నోటీసులిచ్చారని ఆయన పేర్కొన్నారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో ఈ ఐదారుగురు ఒక వర్గంగా ఉన్నారని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌లో మొత్తం 9 సభ్యులున్నారని, అందులో ఐదాగురు మాత్రమే తనకు నోటీసులిచ్చారని తెలిపారు. వాళ్ల నిర్ణయమే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా చెబితే ఎలా ప్రశ్నించారు. హెచ్‌సీఏ రాజ్యాంగాన్ని ఆ ఐదుగురు ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిని అరికట్టడానికి అంబుడ్స్‌మన్‌ను నియమిస్తే అడ్డుకున్నారని తెలిపారు. వాళ్ల అవినీతి బయట పడుతుందని తనపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

కాగా ఏప్రిల్ 11న హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో అజారుద్దీన్, విజయానంద్ వాగ్వాదానికి దిగారు. సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్ మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీపైనే వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వివాదం ముదిరింది.

Read more RELATED
Recommended to you

Latest news