ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న బబితా ఫొగాట్‌ ?

-

రెజ్లింగ్‌ ఛాంపియన్‌ బబితా ఫొగాట్‌ మళ్ళీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆమె తాజాగా హరియాణా క్రీడా శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. అనివార్య పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రీడా శాఖకు సమర్పించిన రాజీనామా లేఖలో ఆమె తెలిపారు. అలానే ఇక తాను బీజేపీ తరపున రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని ఆమె ప్రకటించారు.

బరోడా నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికల్లో ప్రచారంలోనూ పాల్గొంటానని ఆమె పేర్కోన్నారు. అయితే బీజేపీ తరపున హరియాణాలోని బరోడా నియోజకవర్గానికి నవంబర్‌ 3న జరగనున్న ఉపఎన్నికకు బబిత పోటీ చేయనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె తాజాగా హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో ఆమె సమావేశం అయ్యారు. బబితా ఫొగాట్‌ గతేడాది ఆగస్టులో తన తండ్రితో కలిసి బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఛార్ఖీ దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news