బాబ్లీకేసును కొట్టేసిన కోర్ట్… అప్పటి టీడీపీ నేతలకు ఊరట

-

2005లో అప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో నిర్మితమైన బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల శ్రీరాంసాగర్ లోని గోదావరి నీరు రాదని నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్లారు. గోదావరి నదీ జలాలను మహారాష్ట్ర దోచుకుంటుందని టీడీపీ పార్టీ ఆరోపించింది. ఆ సమయంలో తెలంగాణ మూమెంట్ ఎక్కువగా ఉంది. అయితే టీడీపీ పార్టీ తెలంగాణ ప్రజల సానుభూతి వ్యక్తం చేసేందుకే ఆ సమయంలో టీడీపీ పార్టీ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుందని ప్రతిపక్షాలతో సహా, మహారాష్ట్ర సర్కార్ కూడా ఆరోపించింది. ఆసమయంలో అక్కడి రైతులు, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. 

ఈ ఘటనపై అప్పుడు టీడీపీ నేతలైన మాజీ మంత్రులు దేవేందర్ గౌడ్, నాగం జనార్థన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేణుగోపాలాచారి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డిలపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో ఉంది. తాజాగా ఈరోజు న్యాయస్థానం ఈ కేసులను కొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Latest news