జగన్ కు వాటికన్ సిటీ అంటే ఆనందం…అమరావతి అంటే కంపరం : చంద్రబాబు

జగన్ కు వాటికన్ సిటీ అంటే ఆనందం…అమరావతి అంటే కంపరమని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి దేవుళ్ళు సంచరించిన ప్రాంతం అని పేర్కొన్న బాబు, మాట తప్పం మడం తిప్పమన్న జగన్ అమరావతికి ఇప్పుడు మాట తప్పలేదా!? అని ప్రశ్నించారు. తాడిపత్రి లో ఒక ఎమ్మెల్యే ఆంబోతులా మా నేతల ఇంటిపై పడతాడా!? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పై జగన్ నాడు రాగాలు తీస్తూ మాట్లాడాడని 22 ఎంపీలు ఏం చేస్తున్నారు ? అని అయన ప్రశ్నించారు. మన దేవాలయాలు, దేవుళ్లను మనం కాపాడుకుందాం అని ప్రజలకు పిలుపునిస్తున్నానని ఆయన అన్నారు.

గ్రామాల్లో పెరుగుతున్న చర్చిలపై హిందువులు ఆలోచన చేయాలన్న ఆయన రాష్ట్రంలో మతమార్పిడులు చేయించటానికి వీల్లేదని అన్నారు. ముఖ్యమంత్రి అలా చేయించడం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. కులమతాలకు అతీతంగా ఉంటానని చేసిన ప్రమాణాన్ని గుర్తించాలన్న బాబు పాస్టర్లకు 5 వేలు ఇవ్వడం చట్ట విరుద్ధం అని అన్నారు. తప్పుడు కేసులు పెట్టే ఏ పోలీసు అధికారిని వదిలిపెట్టమన్న బాబు ప్రతీ కేసు సమీక్షిస్తామని అన్నారు.