ప్రగతి భవన్ ని ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు..తీవ్ర ఉద్రిక్తత.. !

Join Our COmmunity

బేగంపేట్ హరిత హోటల్లో గ్రేటర్ బీజేపీ కార్పోరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చింతల రామచంద్రారెడ్డి అలానే బీజేపీ జిల్లాల అధ్యక్షులు హాజరు అయ్యారు. 48 మంది బీజేపీ కార్పోరేటర్లు ఉండగా  సమావేశానికి 31మంది కార్పోరేటర్లు మాత్రమే హాజరయ్యారు, 16మంది కార్పోరేటర్లు గైర్హాజరు అయ్యారు. లింగోజిగూడ కార్పోరేటర్ రమేష్ గౌడ్ కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

అయితే ప్రగతి భవన్, హరిత ప్లాజా వద్ద భారీగా పోలీసులు మొహరించారు.  అయినా సరే పోలీసుల కళ్ళు గప్పి ప్రగతి భవన్ చేరుకున్నారు కార్పొరేటర్లు . దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల కళ్లుగప్పి ప్రగతి భవన్ మెయిన్ గేట్ ముందు కు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టు సమాచారం.

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news