తెరుచుకున్నాయి: బాధితురాలిని యోధురాలిగా మార్చాలంటున్న బాబు!

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ ఏమాత్రం తగ్గడం లేదు. అధికార పార్టీపై బురద జల్లేందుకు అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేసి బురద జల్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు.

తాజాగా రాజమండ్రి అత్యాచార ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఆమెపై జరిగిన ఘోరంపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. పార్టీ నేతల ద్వారా విషయాన్ని తెలిసుకున్న చంద్రబాబు తీవ్ర ఆవేదన చెందారు. ఘటన గురించి విన్న వెంటనే బాధితురాలికి టీడీపీ తరపున రూ.2లక్షల ఆర్థిక సాయం అందించాలని పార్టీ నేతలకు బాబు ఆదేశించారు. అలాగే పార్టీ తరపున ఆమెను దత్తత చేసుకుని చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అదేవిధంగా బాలికపై జరిగిన ఘోరాన్ని తెలుసుకొనేందుకు టీడీపీ కమిటీ వేసింది. టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ప్రతినిధుల బృందం తాజాగా రాజమండ్రిని సందర్శించి బాధితురాలిని పరామర్శించారు. విచారణ తర్వాత టీడీపీ నిజనిర్ధారణ కమిటి చంద్రబాబుకు నివేదిక అందజేసింది.

అంతకేకాకుండా ఆ బాధితురాలు దళిత బాలిక పదో తరగతి వరకు చదువుకుందని పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారంతో.. ఆమెను పార్టీ తరపున దత్తత చేసుకుని చదివించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ స్పష్టం చేశారు. అంతేకాకుండా బాధితురాలిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి.. టీడీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని నేతలను చంద్రబాబు కోరారు. ముఖ్యంగా వైసీపీ దుర్మార్గాలపై పోరాడే యోధురాలిగా ఆమెను తీర్చిదిద్దాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా… దళితుల విషయంలో, మహిళల విషయంలో అధికారంలో ఉన్నప్పుడు కళ్లు మూసుకుపోయినట్లు ప్రవర్తించినా… ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత బాగా స్పందిస్తున్నారని. బాబులో మార్పు, జ్ఞానం బాగా వచ్చాయని ఈ సందర్భంగా వినిపించడం కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Latest news