బాబు ప్లాన్ ప్లాప్… అతితెలివితో ఇరికించేసిన రామోజీ!

-

వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం తీసుకున్న సంచనలన నిర్ణయాల్లో… టీడీపీ నేతలకు, వారి అనుకూల మీడియాకు అత్యంత బలంగా షాకిచ్చిన విషయం “మూడు రాజధానులు”! నాటినుంచీ ఆ ఆలోచన అమలును అడ్డుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలనూ బయటకు తీసి ప్రయోగించారు బాబు! సరిగ్గా ఉద్యమాలు చేద్దామనుకునే సరికి కరోనా భయం వారిని కట్టడిచేసేసింది! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… “బాబు అమరావతి కావాలనే అడుగుతున్నారు తప్ప విశాఖ వద్దని చెప్పడం లేదు” అనే కలరింగ్ ఇవ్వడం.. అందులో సక్సెస్ అవ్వడం! కానీ ఆ వ్యూహం తాజాగా ఫెయిల్ అయ్యింది!!

ఈ క్రమంలో శాసనమండలిలో బిల్లుని అడ్డుకోవడం.. కోర్టులో పిటిషన్స్ వేయడం.. ధర్నాలు, దీక్షలు వంటివి చేయించడం.. ఆన్ లైన్ లో ఫోటోలు పెట్టడం.. అమరావతి గొప్పతనాన్ని వారి ఊహల మేరకు రాయించడం.. గవర్నర్ కు లేఖలు రాయడం.. రాష్ట్రపతికి వినతిపత్రాలు సమర్పించడం వంటివి అన్నీ చేసేసింది టీడీపీ & కో! కానీ వాటిలో ఏ ఒక్కటీ సఫలమయ్యే పరిస్థితి కనిపించడం లేదు! దీంతో… ఆఖరి అస్త్రం అనుకున్నారో లేక తాను కూడా ఒక రాయి వేద్దామని నిర్ణయించుకున్నారో ఏమో కానీ… ఈనాడులో కథనం ఒకటి రాసుకొచ్చారు రామోజీ!

కోటి అరవై లక్షల ఏళ్ల క్రితం తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు సముద్రంలో చీలిక ఏర్పడినట్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తన పరిశోధనాంశాన్ని వెల్లడించారు.. దీని కారణంగా 68 లక్షల ఏళ్లకు పూర్వం నుంచి 30 లక్షల ఏళ్ల పూర్వం వరకు ఆ చీలికలో అలజడి ఉండేది.. దీని వల్ల భవిష్యత్తులో భూకంపాలు ఏర్పడే అవకాశం ఉందది.. అన్న విషయాన్ని ఒక ప్రొఫెసర్ చెప్పినట్లుగా “ఈనాడు”లో కథనం రాయించారు! ఇంతకు మించిన దిగజారుడుతనం మరొకటి వుంటుందా అని వినిపిస్తోన్న మాటల సంగతి కాసేపు పక్కనపెడితే… “విశాఖను రాజధానిగా వద్దని రామోజీ కూడా పరోక్షంగా ప్రస్థావించినట్లే” అనేది ఇప్పుడు హాట్ టాపిక్!!

దీంతో… ఇంతకాలం అమరావతి రాజధానిగా ఉండాలని మాత్రమే కోరుతూ… విశాఖను రాజధానిగా వద్దని కానీ, అది సూటబుల్ కాదని కానీ చెప్పే సాహసం చేయకుండా.. బాబు బాగానే మ్యానేజ్ చేసుకుంటూ వచ్చారు! కానీ తాజాగా “ఈనాడు”లో వచ్చిన కథనంతో… నాడు “అమరావతి” పేరు సూచించినప్పుడు రామోజీ చూపించిన ఉత్సాహమే.. నేడు విశాఖ వద్దు అని పరోక్షంగా తన కథనాలతో చూసిస్తున్నారని చెబుతున్నారు విశాఖ వాసులు! దీంతో… బాబు వ్యూహాన్ని తన కథనంతో రామోజీ దెబ్బకొట్టినట్లు అయ్యింది. ఫలితంగా… బాబుతో పాటు రామోజీని కూడా కలిపి “ఉత్తరాంధ్ర ద్రోహులు” గా లెక్కేసుకుంటున్నారు ఉత్తరాంధ్ర వాసులు!!

Read more RELATED
Recommended to you

Latest news