జగన్ పుట్టిముంచే భారీ డ్యామేజ్ ఇది .. వెంటనే ఆపాలి లేదంటే … !

-

వైసీపీ అధినేత వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో మరియు ప్రజా సంకల్ప పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలు పింఛన్లను రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. అయితే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు తొలి సంతకం రెండు వేల నుండి పింఛన్లు 2250 రూపాయలకు చేస్తున్నట్లు సంతకం పెట్టడం తో రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. 3000 చేస్తానని చెప్పి 2250 రూపాయలు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. Image result for ys jagan

కాగా ఇటీవల జగన్ తీసుకున్న కొత్త నిర్ణయం రాష్ట్రంలోని చాలామంది పింఛనుదారుల్లో అసంతృప్తికి దారితీస్తోంది. పింఛన్ల పెంపుతోపాటు పింఛను వయోపరిమితిని కూడా తగ్గించి కొత్తవారికి ఇస్తామని ప్రకటించారు. ఇక్కడే ప్రభుత్వం అతి తెలివిగా వ్యవహరించింది. పింఛన్లు పొందుతున్నవారిలో అర్హులు, అనర్హులను గుర్తించి పనికి శ్రీకారం చుట్టింది. దీంతో చాలామంది చంద్రబాబు హయాం నుండి పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు కొత్త నిబంధనల మేరకు జగన్ ప్రభుత్వంలో అనర్హులు అన్నట్టు ఎక్కువ మంది చేరటంతో జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో వైసిపి పార్టీని పుట్టిముంచే భారీ డ్యామేజ్ స్టార్ట్ అయింది.

 

నోటి కాడ ముద్ద జగన్ లాగేస్తున్నాడు అంటూ వృద్ధులు తీవ్ర స్థాయిలో పింఛన్లు కోల్పోయినవారు జగన్ ని బండ బూతులు తిడుతున్నారు. దీంతో చాలామంది వృద్ధులు ఇంటి నుండి బయటకు వెళ్ళి పని చేసుకునే స్తోమత లేక శక్తి లేక పింఛన్ల పై ఆధారపడిన వాళ్లు వైయస్ జగన్ నీ అనవసరంగా ముఖ్యమంత్రి చేశామని బాధపడుతున్నారు. దీంతో ఈ నిర్ణయం పట్ల వైయస్ జగన్ సర్కార్ ఒక్కసారి ఆలోచించి ఆపకపోతే ప్రభుత్వానికి పూర్తి డామేజ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news