ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ షాక్‌… రేపటి నుంచే 50 శాతం అదనపు ఛార్జీలు !

-

సంక్రాంతికి ఏపీఎస్సార్టీసీ సిద్ధమని… సంక్రాంతికి 6970 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. జనవరి 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు చెప్పారు. గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సులు ఉండేవని.. అదనపు సర్వీసులకు ప్రత్యేకంగా సర్వీస్ కోడ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే… సంక్రాంతి ప్రత్యేక బస్సులకు మాత్రమే 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని… మన ప్రాంతం వారు మన బస్సులను ఆదరిస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు.

ప్రయాణీకులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని… సంక్రాంతికి ప్రజలందరూ స్వగ్రామాలకు వస్తారన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని… ప్రతీరోజు తెలంగాణ, కర్ణాటకల నుంచీ నాలుగు వేల బస్సులు వస్తాయని వెల్లడించారు. రోజుకు సుమారుగా నాలుగువేల బస్సులుంటాయని.. రెగ్యులర్ సర్వీసుల్లో 60 శాతం, స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఇప్పటికే రిజర్వయ్యాయని చెప్పారు. ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచీ బస్సులు బయలుదేరతాయని.. కాలనీలు, కూడళ్ళ వద్ద ప్రయాణీకులు ఎక్కువగా ఉంటే, అక్కడ నుంచే బస్సులు బయలుదేరుతుందని వెల్లడించారు. డీజిల్ రేటు 60 శాతం పెరరగడం, ఒకవైపు బస్సు ఖాళీగా వెళుతుంది కనుక, టికెట్ ఛార్జి 50 శాతం పెంచామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news