ఆర్టీసి సమ్మెలో పిల్లలు ఎంత ఎంజాయ్ చేసారో కదా…? సమ్మె అవ్వకుండా ఉంటే చాలని ఫ్రెండ్స్ దగ్గర, మీలో మీరు ఎన్ని సార్లు అనుకుని ఉంటారో కదా…? అప్పుడు ఎంజాయ్ చేసారు. మరి ఇప్పుడు మీ చదువు ఎవరు చదువుతారు చెప్పండి. అందుకే మీకు మీ స్కూల్స్, ప్రభుత్వం షాక్ ఇచ్చాయి. రెండో శనివార౦ లేదు, సంక్రాంతి సెలవలు మీరు అనుకున్నన్ని రోజులు లేవు. స్కూల్ కి వెళ్ళాల్సిందే.
అప్పుడు ఎంజాయ్ చేసారు కాబట్టి ఇప్పుడు చాదువుకోవాల్సిందే అంటుంది తెలంగాణా ప్రభుత్వం. ముందుగా ప్రకటించిన ఉత్తర్వుల ప్రకారం.. జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు నిర్ణయించగా.. తాజాగా వీటిని జనవరి 12 నుంచి 16 వరకు కుదించారు. ఈ మేరకు బుధవారం (జనవరి 8) ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేయడంతో దసరా సెలవలను పొడిగించారు.
దీనితో స్కూల్స్ లో సిలబస్ అవ్వక అధ్యాకులు నానా అవస్థలు పడుతున్నారు. గతేడాది క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండగకు కలిసి 10 రోజులకు పైగా సెలవులు ఇవ్వగా.. ఈసారి సగానికి సగం తగ్గించారు. అప్పుడు ఎంజాయ్ చేసారు కాబట్టి ఇప్పుడు చదువుకోండి. ఎలాగూ రెండు నెలలు పోతే హాఫ్ డే స్కూల్స్, మూడు నెలలు పోతే సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి వెళ్లి చదువుకోండి.