కాంగ్రెస్ వైఫల్యాల వల్లే మోదీ శక్తివంతమవుతున్నారు.- బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

-

కాాంగ్రెస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మూడు రోజుల గోవా పర్యటనలో ఉన్న దీదీ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్లే నరేంద్ర మోదీ శక్తివంతంగా తయారవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాను సీరియస్ గా తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతోందని.. దానికి దేశం ఎందుకు బాధ పడాలని ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీకి గతంలో అవకాశం వచ్చినా… బీజేపీపై పోరాడకుండా బెంగాల్లో నాపై పోటీ చేశారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీని స్థాపించి, ఎవరి సహాయం లేకుండా మూడు సార్లు టీఎంసీని అధికారంలోకి తీసుకువచ్చామని ఆమె వెల్లడించింది. బీజేపీ పై మా పోరాటం కొనసాగుతుందని దీదీ స్పష్టం చేశారు. కేంద్రం రాష్ట్రాలను భయపెట్టాలని చూస్తోందని.. బీజేపీకి భయపడేది లేదని ఆమె అన్నారు. రాష్ట్రాలు బలంగా ఉన్నప్పుడే కేంద్రం బలంగా ఉంటుందని దీదీ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమె ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగానే గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ తో సమావేశమయ్యారు. పొత్తు గురించి చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news