బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ’అఖండ‘.. ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

-

బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృస్టిస్తోంది. భారీ అంచనాతో రిలీజ్ అయిన అఖండ రికార్డులతో దూసుకుపోతోంది. బాలకృష్ణ , బోయపాటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీపై రిలీజ్ కు ముందు నుంచే క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లయన్ సినిమాలు బిగ్ హిట్ కావడంతో అఖండపై భారీ అంచానాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే అఖండ విజయపథంలో దూసుకుపోతోంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు ట్విట్టర్ వేదికగా అఖండపై ప్రశంసల వర్షం కురిపించారు.

అఖండ మూవీ 5 రోజుల్లోనే రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఏరియాల వారీగా సీడెడ్ లో రూ.10.72 కోట్లు, ఉత్తరాంధ్ర లో రూ. 4.12 కోట్లు, ఈస్ట్ లో 2.82 కోట్లు, వెస్ట్ లో రూ. 2.22 కోట్లు, గుంటూర్ లో రూ. 3.50 కోట్లు, క్రిష్టాలో రూ. 2.51 కోట్లు, నెల్లూర్ లో రూ. 1.83 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ కలెక్షన్లు ూ. 41.14 కోట్లు, టోటల్ వరల్డ్ కలెక్షన్లు రూ. 80.30 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఏపీలో బెనిఫిట్ షోల లేకపోవడం, టికెట్ ధరల కారణంగా మరో రూ. 10-15 కోట్లు తగ్గినట్లుగా ట్రెడ్ పండితులు అంచానా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news